ఆంజనేయస్వామి మంత్రం.: భూత ,ప్రేత ,పిశాచ నివారణ కొరకుశత్రుపీడ నివారణకు ,ఆరోగ్యము కొరకుభూత ,భవిష్యత్ ,వర్తమానం తెలుసుకోవడానికి
ఆంజనేయ స్వామి మంత్రం
ఓం శ్రీ మహా గణాధిపతయే నమ :
ఓం శ్రీ గురుబ్యోo నమ :
ఓం శ్రీ సదాశివాయ నమ :
ఓం శ్రీ అపరాజితాయై నమ :
ఓం శ్రీ హనుమతే నమ :
శ్రీ సదాశివ సంస్థ
( Non profit organization )
పరకాయ ప్రవేశం ద్వారా మనిషి కనిపించకుండా , ఫోన్ లేకుండా మనతో మాట్లాడుతారు డబ్బులు ఇవ్వమని బెదిరిస్తారు .
అలా మాట్లాడే వాళ్ళ పేరు ,అడ్రస్ మనకు తెలియదు .ఇలా బెదిరించే వాళ్ళ పేరు ,చిరునామా
ఆంజనేయ స్వామి మంత్రం సహాయంతో తెలుసుకోవచ్చు.
ఆ వివరములతో పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసి మనల్ని బెదిరించే వాళ్ళకి తగిన శిక్ష విధించవచ్చు .
నష్టపోయిన డబ్బు తిరిగి పొందవచ్చు.
మంత్రాలు ,యంత్రాలు, తంత్రాలు ,క్షుద్ర పూజలు చేతబడులతో మనల్ని బాధ పెట్టే
దుష్టమంత్రగాళ్ల కుట్రలు తెలుసుకొని వెంటనే ఆ కుట్రలు భగ్నం చేసి తగిన రక్షణ పొందవచ్చు .
శత్రువులు లేదా దుష్టమంత్రగాళ్ల ఎటువంటి అపకారం చేయాలి అనుకున్నా వెంటనే మనము తెలుసుకోవచ్చు.
ఆంజనేయ స్వామి మంత్రం
సంకల్పం : మనిషి కనపడకుండా మాట్లాడే వారి పేరు ,ఇంటి పేరు ,చిరునామా తెలియచేయి.
వారి దగ్గర ఉన్న రహస్య విద్యలు మాకు తెలియచేయి .
భూత ,భవిష్యత్ ,వర్తమాన జ్ఞానము ను తెలియచేయి
మంత్ర, యంత్ర ,తంత్ర ప్రయోగములు ,క్షుద్ర ప్రయోగములు ,చేతబడుల నుండి మమ్మల్ని రక్షించు.
శత్రువులను నాశనము చేయి.
ఆరోగ్యమును ప్రసాదించు .
గమనిక : ప్రతిరోజు జపము చేసే ముందు సంకల్పము చెప్పాలి .
మంత్రం : హం హనుమతే నమః
జప సంఖ్య : 1 లక్ష
నైవేద్యం : అరటి పండ్లు ,వడలు ,అప్పాలు ,
పులిహోర ,పెరుగన్నం. మీకు వీలైనవి శక్తి కొలది పెట్టవచ్చు.
ప్రతిరోజు జపము చేసిన తరువాత నైవేద్యం పెట్టవలెను .
ఈ మంత్రము ను జపించడం వల్ల కలుగు ఫలితములు
భూత ,భవిష్యత్, వర్తమానం తెలియును. అనగా గతంలో జరిగిన విషయములు ,జరుగుతున్న విషయములు ,జరగపోవు విషయములు స్వామిని అడిగి తెలుసుకోవచ్చు .
భూత , ప్రేత ,పిశాచ బాధలు పోతాయి.
శత్రువుల పీడ తొలగిపోతుంది.
ఆరోగ్యం కలుగును.
అనేక సిద్ధులు కలుగును.
ఒక లక్ష జపము 100 గంటలలో చేయవచ్చు.
రోజుకి 3000 (30 మాలలు ) జపము చేస్తే 35 రోజులలో ఒక లక్ష చేయవచ్చు .
మంత్రం సిద్దించినప్పుడు ఆంజనేయస్వామి మన ప్రశ్నలకు జవాబులు తెలియచేయును.
మంత్రం సిద్దించే వరకు ప్రతిరోజు జపము చేయాలి .
ఒక సారి మంత్రము సిద్దిస్తే ఆంజనేయస్వామి జీవితాంతం మనము అడిగే ప్రశ్నలకు జవాబులు
చెబుతారు .
మంత్రం సిద్దించిన తరువాత రోజుకి 500 (5 మాలలు ) జపము చేస్తే సరి పోతుంది . అనగా 25 నిమిషముల
జపము చేస్తే సరిపోతుంది . ప్రతిరోజు 1000 ( 10 మాలలు ) జపం చేయడం చాలా మంచిది .
నియమాలు :
మంత్ర సాధనకు ముందు సిద్దకుంజికా స్తోత్రం 5 or 11 సార్లు చదవాలి . ఈ స్తోత్రం చదవటంవల్ల మంత్రం తొందరగా సిద్ధిస్తుంది .
Or
ఆత్మరక్షా దిగ్బంధన మాలా మంత్రం ఈ స్తోత్రం చదవటంవల్ల మంత్రం తొందరగా సిద్ధిస్తుంది .
ఆత్మరక్షా దిగ్బంధన మాలా మంత్రం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం చదివితే వారి మీద మంత్ర, యంత్ర. , తంత్ర ప్రయోగములు ,క్షుద్రప్రయోగములు , చేతబడి , బాణామతి , చిల్లంగి పనిచేయవు .
స్తోత్రము ఒకసారి , మంత్రం 200 సార్లు చదవాలి . ఒకసారి చదవడానికి 45 నిమిషాల సమయం అవసరం .
ఉదయం , సాయంత్రం చదవాలి .
కూర్మ చక్రం లిఖించి దాని పై దర్భచాప ( kusha grass mat ) వేసి దాని మీద కూర్చొని జపం చేయాలి దానివల్ల తొందరగా మంత్రం సిద్ధిస్తుంది.
మంత్రము ను గురువు ద్వారా స్వీకరించాలి .
రుద్రాక్ష మాల వాడండి . 108 పూసలు ఉండాలి .
తూర్పు దిక్కు కూర్చొని మంత్ర జపం చేయాలి.
ఏకాంత ప్రదేశములో కూర్చొని జపము చేయాలి.
మంత్రం సిద్దించేవరకు బ్రహ్మచర్యం పాటించాలి .
మంత్రమును శబ్దము రాకుండా పెదవులు కదపకుండా మనస్సులో జపించడం వల్ల అదిక ఫలితం వచ్చును.
మంత్రమును స్పష్టముగా , నిదానంగా ఉచ్చరించాలి
జపము చేసేటప్పుడు ఎవ్వరూ చూడరాదు .
జపం చేసేటప్పుడు కదలకూడదు
జపము చేసేటప్పుడు వీపు వంగి ఉండకూడదు నిటారుగా ఉండాలి .
మంత్ర సాధనకు ఉపయోగపడే పుస్తకం
మంత్ర సాధనకు పాటించవలసిన నియమాలు ,ఆచారములు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది
పుస్తకం పేరు : మంత్రానుష్ఠాన చంద్రిక
https://devullu.com/books/mantranushtana-chandrika
రచయిత : m .సత్యనారాయణ సిద్ధాంతి.
పబ్లిషర్ : మోహన్ పబ్లికేషన్స్
ఆంజనేయ స్వామి మంత్రమును సేకరించిన పుస్తకం
పుస్తకము పేరు : గుప్త మంత్ర యంత్ర తంత్ర రహస్యములు. Page no : 79
https://devullu.com/books/gupta-mantra-yantra-tantra-rahasyamulu/
రచయిత : ధోగుపర్తి గుప్త సిద్ధాంతి.
పబ్లిషర్ : వేంకటేశ్వర పబ్లికేషన్స్
కూర్మ చక్రం సేకరించిన పుస్తకం
పుస్తకం పేరు : యక్షిణి తంత్ర రహస్యము ,ఉడ్డీశ తంత్రం
రచయిత : బ్రహ్మ శ్రీ మేడవరపు సంపత్ కుమార్. పబ్లిషర్ : గొల్లపూడి వీరాస్వామి సన్
ఆత్మరక్షా దిగ్బంధన మాలా మంత్రం
పుస్తకం పేరు : అనుభవ మహామంత్ర తంత్ర యంత్ర శిరోమణి page no : 161
https://devullu.com/books/anubhava-mantra-yantra-tantra-siromani
రచయిత : బొమ్మకంటి వేంకట సుబ్రమణ్య శాస్త్రి పబ్లిషర్ : గొల్లపూడి వీరాస్వామి సన్
సిద్దకుంజికా స్తోత్రం సేకరించిన పుస్తకం
https://devullu.com/books/acharya-siddha-nagarjuna-tantram
పుస్తకం పేరు : శ్రీ ఆచార్య సిద్ధనాగార్జున మహాతంత్రం Page no : 185 page
రచయిత : బ్రహ్మశ్రీ గుండు వెంకటేశ్వర రావు పబ్లిషర్ : శ్రీ సిద్దేశ్వరి పబ్లికేషన్స్
శ్రీ సదాశివ సంస్థ
( Non profit organization )
మీ సమస్యల పరిస్కారం కొరకు ,సలహాల కొరకు వ్రాయండి
Mail :srisadasiva9@gmail. com
WEbsite : srisadasiva.blogspot.com
Facebook :
https://www.facebook.com/profile.php?id=100043155916766